మనసు కొమ్మకు పూసే పువ్వుల భాష
కాగితం మీద ప్రేమై ప్రకటనవుతుంది
కొన్ని భావాలను వ్యక్తం చేసే భావావేశం
హృదయానికి సాంత్వనిచ్చే స్పందనవుతుంది
మేఘాల అంచున విరిసే మెరుపు
చూపుల వలలో చిక్కి వెన్నెలవుతుంది
మాటలన్నీ మంత్రాలైతే చీకటికి చొరవొచ్చి
ఆకుచాటు అందాన్ని అక్షరం చేస్తుందేమో
కలలన్నీ రాస్తూ పోతే ఏమవుతానో
నెమ్మదిగా ఆవరించే ఉద్వేగానికే తెలియాలి
No comments:
Post a Comment