Tuesday, 15 February 2022
// నీ కోసం 446 //
ఈ చీకటి కెరటాలలో జ్ఞాపకాల వలలు
ఏడురంగుల ఇంద్రధనస్సులై నన్నల్లుకుంటూ
మనసు మడతలు విప్పితే వచ్చే పరిమళమంతా
నీ ఊహదేనన్న వాస్తవం
చాలదూ... ఉక్కిరిబిక్కిరవ్వడానికి..
నువ్వూ నేనూ స్వప్నంలో కలుస్తున్నా
వాస్తవంలో తప్పిపోయిన ఆత్మలం
కాదనగలవా..
తలపులు సయ్యాటాడే ఒక రాత్రికి
నక్షత్రాలలో విహరించినట్లనిపిస్తే
మధురక్షణాలెక్కడో లేవని అనిపించడం తప్పు కానట్టే..
మనసు దాచలేని నీ చూపులు
కొత్తలోకానికి రమ్మంటుంటే
మౌనమే మధురిమకు సమాధానమై
కదులుతున్న క్షణాలను ఆగమన్నది నిజమే
However..
ప్రేముందని మనసివ్వలేదు..నేనే నువ్వయినప్పుడు
ప్రేమన్నది కృతి కాక మానదు..నాతో నువ్వున్నప్పుడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment