సన్నటి మంచుతెరను కప్పుకున్న సాయింత్రం
నీలిరంగు పరిమళాన్ని పూసుకుందేమో ఆకాశం
వేలకొద్దీ ఆకులు రాలుతున్న ఈ సమయం
నీ సౌందర్యలాలసే నేను కప్పుకున్న ఆనందం
మనోహరమైన నీ కన్నుల్లో హేమంతం
అలలై నన్ను తడుముతున్న రహస్యం
నీ గుండెసవ్వడికి దగ్గరైన నా గీతం
ఎన్ని జన్మలక్రితం మొదలైనదో అనుబంధం
నువ్వక్కడ అదృశ్యమై నన్ను చేరినట్టు ఈ వైనం
తదేకంగా లిప్తాడుతున్న నా తడినయనం 💕💜
నీలిరంగు పరిమళాన్ని పూసుకుందేమో ఆకాశం
వేలకొద్దీ ఆకులు రాలుతున్న ఈ సమయం
నీ సౌందర్యలాలసే నేను కప్పుకున్న ఆనందం
మనోహరమైన నీ కన్నుల్లో హేమంతం
అలలై నన్ను తడుముతున్న రహస్యం
నీ గుండెసవ్వడికి దగ్గరైన నా గీతం
ఎన్ని జన్మలక్రితం మొదలైనదో అనుబంధం
నువ్వక్కడ అదృశ్యమై నన్ను చేరినట్టు ఈ వైనం
తదేకంగా లిప్తాడుతున్న నా తడినయనం 💕💜
No comments:
Post a Comment