Monday, 2 December 2019

// నీ కోసం 64 //

వేళ్ళమైళ్ళ దూరాన్ని చెరిపేసి
నన్ననుసరించే అద్భుతం నీ నీడయినట్టు
అలలా వినిపిస్తున్న నా పేరు తీపైనట్టు తెలుసా

నీ కనుపాపల్లోని విద్యుచ్ఛక్తి
నిన్నటిదాకా మూగైన నా హృదయపు తీగల్ని మీటి
అదో కొత్త సంగీతాన్ని సృష్టిస్తుంది తెలుసా

దోసిళ్ళతో నువ్వొంపిన పదాలు దాచి
నువ్వాడే మాటలనే మాలగా కట్టి
నీ మెడలో వేస్తూ మురిసిపోతున్నానని తెలుసా

భాషంటూ లేని నన్ను చదివినట్టు
నా ఆలోచనా స్రవంతిలో నువ్వో శ్రీనాథుడివైనట్టు
ఎన్నెన్నో నవ్వుల నెలవంకలు తెలుసా

అంతకంతకీ నాకు నచ్చేస్తున్నావందుకే
నిశ్శబ్దపు తలపుల్లో సరాసరి చేరి
మానసికంగా ముట్టుకున్నావనే..💕💜

No comments:

Post a Comment