Monday, 2 December 2019

// నీ కోసం 71 //

చెక్కిట మెరుస్తున్న పున్నమి వెన్నెలకిరణం
కిలకిల నవ్వులను దాచుకొని
మనసు చేస్తున్న మువ్వలచప్పుడ్ని
మాత్రం మురిపెంగా ఆలకిస్తుంది

ఏకాంతం నిండి ఉన్న క్షణాలు
యోగనిద్రను వీడి..
తలపుల ద్వారాలు తీసినందుకే
మన చూపులు కలిసి పాడుకున్న యుగళగీతం
వాన గాలి ఉల్లాసమైంది

నువ్వంటే ఎందుకిష్టమో ఏం చెప్పను..
ప్రేమకు పడగలెత్తిన నీ నీడ.. కోటియుగాల నిశ్చింతకు సమానమనా
నా అస్తిత్వమిప్పుడు నీ చిరునామాగా మారిందనా..

లిప్తపాటు లాలనకే నేనలకనందనైతే
అనంతమైన కడలిగా నీ తపన
గుండె వెల్లువకి తీరపు సాంత్వన
ప్రాణానికి ప్రాణమందుకే..
పెదవుల భాషతో ఆర్తిని పంచింది..💕💜 

No comments:

Post a Comment