లిప్తపాటు ఊపిరాగినట్టనిపించే హృదయాలాపన
నాకు మాత్రమే వినిపిస్తుందా
పట్టరాని ఆనందాన్ని మౌనంలో పలికించే నువ్వు
ఇన్ని రాగాల సంగతులెప్పుడు నేర్చావో
అల్లరి పల్లవి పాడుతున్న పెదవులు నీవైతే
నా కళ్ళెందుకు మూసుకున్నాయో
కవితలల్లుకొనే నా వేళ్ళిప్పుడు మూసుకున్న రెప్పలపైన
వెన్నెల జలపాతమంతా స్వప్నంలా కదిలిపోయిన వేళ
సుప్రభాతం నా ఎదుటనే అవుతున్న సంతోషం
నీ చూపుల భూపాలంలో కనిపిస్తున్న ఆర్తి
నాకిప్పటికిప్పుడు ప్రాణం పోస్తున్న సుధామాధుర్యమే మరి
మనస్స్పందన సముద్రపు అలల వెల్లువైంది చూడు
సుతిమెత్తని మాటలు తీపి పాటగా నాకందించగానే..💜💕

No comments:
Post a Comment