Monday, 2 December 2019

// నీ కోసం 70 //


అలర చంచలమై నీ ఆత్మ నవ్విందంటే
తొలిసిగ్గుల నా బుగ్గలు నిమిరినందుకేగా
ఇన్నిలిప్తల దూరాన్ని కరిగించిన శరత్పున్నమి వేళ
దోసిళ్ళతో నువ్వు వివశత్వాన్ని కుమ్మరించినట్లేగా

క్రీగంట మెరుస్తున్న నా కలవరం
నీ కన్నుల్లో తెరుచుకున్న కలల ద్వారానికేగా
పుప్పొడిగా రాలుతున్న ప్రేమరాసుల మేర
ఆదమరచిన అధరాల ఆనందపు సవ్వళ్ళేగా

ఏకాంతపు క్షణాల నీ నిశ్శబ్దం
అలలా నా తనువాలపించు సంగీతమేగా
చినుకుగా మొదలైన నీలో దివ్య రసధార
నన్ను కరిగించి పొందాలనుకున్న యోగసిద్ధికేగా

కల్లోలపడకు..
నీడగా నన్ను అనుసరించినప్పుడే నువ్వయిపోయాగా
వర్తమానాన్ని మరిచానంటే ముందుముందు కలవాలనేగా 💕💜

No comments:

Post a Comment