Monday, 2 December 2019

// నీ కోసం 67 //

ముగింపులేని సుదీర్ఘ వాక్యంలా
అంతరంగం సురగంగయ్యింది..
తరంగంలా నా జీవితంలో నువ్వడుగుపెట్టగానే..

పెదవంచును తాకిన కెరటం నువ్వని
నీ తలపు తమకంగా ఎగిసినప్పుడే గుర్తించా

వాడిపోని విరిలా వెనుకెనుకే నువ్వు
క్షణానికోమారు చిలిపి గాలివై పలకరిస్తావని
నీకూ తెలియకపోవచ్చు

ఆద్యంతంలేని ఆనందాన్ని రెప్పల్లో దాచి
నిన్నో కవితలా విశ్లేషించుకుంటూ
నేనో వర్ణనకందని మౌనమై మిగిలిపోతున్నా

చిలిపిదనం చిదిమిన వెన్నెల పువ్వు నేనైతే
అనుమతిలేని అతిథిగా నువ్వొచ్చి ఆక్రమించింది తెలుసా

ఊహూ..
నువ్వో నిశ్శబ్దానివని కనిపెట్టేసాలే
నా పరోక్షంలో మాత్రమే నన్ను తలచుకుంటావని..💕💜

No comments:

Post a Comment