Monday, 2 December 2019

// నీ కోసం 68 //

చీకటి చీల్చిన చిల్లుల కుండా
వెలుతురు ముసిరెను మనసుల గుండా
గడవని రాతిరి వెక్కిన చోట
కాలపు చప్పుడు కనబడకుండా
కలతలు మూగే కన్నుల్లోన
కాటుక చెదిరే కలవై రావా

దూరం కరిగిన బంధపు నీడ
జీవితం ఎగిసిన పువ్వుల జెండా

చూపులు గుచ్చుకున్న వీపుని చేర
అందుకోలేనా చేయిచాచిన మేర..
అల్లన నవ్వే దిక్కును చూడ
అలవై రావా అల్లిక కోర
మట్టిముంతకు రంగులంటిన కాడ
ఆత్మలు కూడిన అంతర్దేహపు జాడ 💞☘️

No comments:

Post a Comment