అమాసలానే లేదసలు
మునిమాపువేళ ఈ దీపాలవారథి
బంగారుపోగులా సాగి
ఆవైపునున్న నీతో నన్ను కలిపినట్టు
ఈ నల్లని రాతిరి
వెన్నెల మరిగిన మైదానంలా
మదిలో మృదువైన భావమొక్కటే మిగిలింది
శరద్వలువలు విడుస్తున్న ఈవేళ
నీ నిశ్వాసల తాపమే
నా ఊపిరి మోహనరాగముగా మారి
నేనాలపిస్తున్న సంగీతం
నువ్వనుభవిస్తున్న ఆదమరుపు కావాలని..😊
ఇన్నినాళ్ళు నిన్ననుసరించలేదని అనుకోకు
నీ సమస్త నిశ్శబ్దం
నన్ను నీతో కలిపిన ఏకత్వంగా మధురించు 💕💜
మునిమాపువేళ ఈ దీపాలవారథి
బంగారుపోగులా సాగి
ఆవైపునున్న నీతో నన్ను కలిపినట్టు
ఈ నల్లని రాతిరి
వెన్నెల మరిగిన మైదానంలా
మదిలో మృదువైన భావమొక్కటే మిగిలింది
శరద్వలువలు విడుస్తున్న ఈవేళ
నీ నిశ్వాసల తాపమే
నా ఊపిరి మోహనరాగముగా మారి
నేనాలపిస్తున్న సంగీతం
నువ్వనుభవిస్తున్న ఆదమరుపు కావాలని..😊
ఇన్నినాళ్ళు నిన్ననుసరించలేదని అనుకోకు
నీ సమస్త నిశ్శబ్దం
నన్ను నీతో కలిపిన ఏకత్వంగా మధురించు 💕💜
No comments:
Post a Comment