నీ వేలికొసల స్పర్శతో
నాలో ఓ కోయిల పుట్టి
ఊపిరి లిపిని అప్పుడే చదివినట్టు
అదిరే పెదవులు ఆలాపన మొదలెట్టాయి
సుదూరతీరాలకు నిన్నూనన్నూ చేర్చిన కాలం
అక్కడ ఆగి విశ్రాంతి తీసుకుంటున్నట్టు
ఆదమరచి నన్ను చూస్తున్న నీ కన్నుల్లో
రసలేఖలవంటి దివ్యకాంతులు కొలువయ్యాయి
సతమతమైన నిశ్శబ్దం నవ్వుని ఆశ్రయించి
దూరం పగిలిన ఆనందం కలో నిజమో తెలీక
మౌనాన్ని క్రీగంట ప్రసరిస్తూ
అద్భుతమైన ఆ వివశత్వానికి లొంగిపోయింది
మనసు ఎక్కుపెట్టి ఎలా దాచేసావో
నక్షత్రాల పుప్పొడి రాసినట్టు
నాలో ఇప్పటికిప్పుడిన్ని దృశ్యాలు..
ఏకాంతాన్ని కవ్వింతగా కలవరపెడుతున్నట్టు 💕💜
నాలో ఓ కోయిల పుట్టి
ఊపిరి లిపిని అప్పుడే చదివినట్టు
అదిరే పెదవులు ఆలాపన మొదలెట్టాయి
సుదూరతీరాలకు నిన్నూనన్నూ చేర్చిన కాలం
అక్కడ ఆగి విశ్రాంతి తీసుకుంటున్నట్టు
ఆదమరచి నన్ను చూస్తున్న నీ కన్నుల్లో
రసలేఖలవంటి దివ్యకాంతులు కొలువయ్యాయి
సతమతమైన నిశ్శబ్దం నవ్వుని ఆశ్రయించి
దూరం పగిలిన ఆనందం కలో నిజమో తెలీక
మౌనాన్ని క్రీగంట ప్రసరిస్తూ
అద్భుతమైన ఆ వివశత్వానికి లొంగిపోయింది
మనసు ఎక్కుపెట్టి ఎలా దాచేసావో
నక్షత్రాల పుప్పొడి రాసినట్టు
నాలో ఇప్పటికిప్పుడిన్ని దృశ్యాలు..
ఏకాంతాన్ని కవ్వింతగా కలవరపెడుతున్నట్టు 💕💜
No comments:
Post a Comment