Tuesday, 20 June 2023
//నీ కోసం 528//
నువ్వొక పూదోటవైతే..
నాకెప్పుడూ ఆ దారుల్లోనే నడవాలనిపిస్తుందని చెప్పానా !!
ఇప్పుడిప్పుడే వెన్నెల చినుకులు
ఆరంభమైన సమయం
విరజాజులకి సువాసన ఎక్కువయ్యింది
నీ చిరునవ్వును ఊహిస్తున్న
నా రెప్పల వెనుక తడెప్పుడు చేరిందో
ఈ వివశత్వాన్నేం చెప్పను
నిశ్శబ్దరాగం మోహపెడుతున్న ఈ పొద్దు
మనసుకి రెక్కలొస్తుంటే
దూరాన్ని అధిగమించి నిన్ను చేరాలనిపిస్తుంది
ప్రేమని ప్రాణాయామంగా చేసే నీ దగ్గర
యుగాల ఎడబాటు అంతమయ్యేందుకు
'లవ్ యూ' మంత్రోపదేశం తీసుకోవాలనుంది
ఏకాంతస్వప్నంలో ఎదురుచూస్తానంటే చెప్పు
నన్ను like చేసి హృదయమంతా share చేసుకునేలా cuteగా వచ్చేస్తా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment