Tuesday, 20 June 2023
//నీ కోసం 514//
ఇంత కాలం ఎక్కడున్నావోనని
ఎంత ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నానో
మెత్తటి శబ్దంతో భలే చెంత చేరుతావు
దూరాలు దాటి గిలిగింతలు పెట్టే
నీ చిరునవ్వులోని నీలిరంగుకో
సువాసనుందని తెలుసా..
అదే గ్రీష్మంలో చిగురాకు వసంతపు పరిమళం మాదిరి
సుకుమారంగా నన్నంటుతూ కలదిరుగుతుంది..
ఇక, ఒళ్ళంతా తనివితీరా నిమురుతున్నట్లు
నీ కళ్లు... నిప్పురవ్వలో.. అయిస్కాన్తపు కిరణాలో
కాలుతున్నంత సేపు తెలియదు కానీ
దీర్ఘ నిశ్వాసల ఉద్విగ్నానంతరం
అరచూపుల ఆవిర్లలో అపురూపంగా మెరిసే భాష్పం మాత్రం
అత్యానందపు కానుకగా వెలుగుతుంది
నువ్వో ఏమరుపాటు విచలిత్వానివి కాదని తెలుసులే
ఎంతో ఏకాగ్రతగా
నన్నో నేమలీకగా దాచుకున్నాననుకుంటూ
కల్లోల సముద్రంగా మార్చేస్తుంటావ్ కదా..
నువ్వెంత మురిపానివో లోలోపల తడిచిపోతూ నేనుంటున్నా..
Every moment we share is hauntingly beautiful n soo precious to me
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment