Tuesday, 20 June 2023
//నీ కోసం 519//
ఓహ్హ్
గ్రీష్మతాపమంటారే.. ఎటు పోయిందది
విరబూస్తున్న సన్నజాజులు
ఇంద్రియాల్లో లీనమై మనసుని అదిమిపెడుతున్నప్పుడు
కోయిల పాడుతున్న పాటకు
ఏకగ్రీవంగా తలలూపుతున్నట్లు చెట్లు..
ఏకాంతద్వీపంలో తీపివగరు ప్రేమకాంక్షలా
రెక్కలిప్పుకున్న మధురకవిత
లయతప్పి పెదవులపై మోహనగా మారి
నిరవాన్ని సంచలనం చేస్తున్నప్పుడు..
విరామంలేని అల్లరి గుసగుసలతో
ఆవిరి మేఘాలు దాటొచ్చి వీస్తున్న గాలి
వసంతపు రహస్యాన్ని అనుభవించమని
మృదువుగా తీస్తున్న కూనిరాగాలు..
Pch.. ఇన్ని అందాల మధ్య సాయింత్రమైనా
సూర్యుడితో సమంగా నువ్వు వేడిగానే ఉన్నట్టున్నావుగా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment