Tuesday, 20 June 2023
//నీ కోసం 517//
నా నుంచి నన్ను విడిపోయేలా చేసి
నువ్వు మాత్రమేం పట్టనట్టు
ఎరుపెక్కిన ఆకాశానికేసి చూస్తావ్
Ohh... గుంపులు గుంపులుగా మేఘాలు
హాయి తీరానికి రమ్మంటుంటే
ఒంటరిగా వెళ్ళేందుకు సిద్ధమయ్యావన్న మాట
కలలకు రంగులద్ది ఏదేదో రాసేలా చేస్తూ
మౌనం నీ అలంకారమైనట్టు
అదేమో అపరిచితమైనట్టుంటావ్
Huh.. వెన్నెల సోనలు కరుగుతూ
నీ చిరునవ్వులు గుర్తుకు తెస్తుంటే
పున్నమి శ్వాసకి సంకటమవుతుందని తెలుసా
ద్రాక్షరసమో.. ప్రేమరసమో తాగి..
ఈ ఊదారంగు పూలు పాడుతున్న సౌందర్యలహరికి
లేతచిగురాకులా నే ఒణుకుతున్నా
Somehow.. as I'm extra inspired..
still following d moon
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment