Tuesday, 20 June 2023
//నీ కోసం 525//
తను: కూ.. కూ..
నేను: ....
తను: కూ.. కూ..
నేను: హహ్.. అలగడమా.. నేనెవర్నీ అలగడానికి
తను: కూ.. కూ..
నేను: అర్ధమైందిలే, తనకి తీరికే లేదు.. ఈరోజు ఆం కూడా తిన్లేదు, కానీ.. నేనెలా ఉన్నానో తలుస్తున్నాడంటావ్..
తను: కూ.. కూ..
నేను: బానే ఉన్నానని చెప్పు.. కనపడని దారంతో తన మనసుకి ముడేసుకున్నాక, విరహాగ్ని వేడికి పగలంతా నిద్రిస్తున్నానని.. వసంతం విసిగిస్తుందని ఏం చెప్పనూ.. అయినా సరే, నా దగ్గర జ్వరం వాసనొస్తుందని అనుమానపడొద్దని చెప్పు..
తను: కూ.. కూ..
నేను: నువ్వు తీయగా పిలిచినప్పుడే అనుకున్నాలే, ఆలశ్యమైనా నన్నారా తీయకుండా తనుండడని.. నిమిత్తమాత్రమన్నది నా విషయంలో నిజం కాదనే నా గర్వం ఋజువైందనే ఈ నవ్వు.. ఇంకా, ఇక్కడ గుప్పుమంటున్న సాంబ్రాణి తన ఉనికిని అందించిందని చెప్పడం మరువకు
తను: కూ.. కూ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment