Tuesday, 20 June 2023
//నీ కోసం 523//
మారని స్వరంతో పిలుస్తున్నాననా
మౌనాన్ని ముడేసుకుని ముభావంగా వెళ్ళిపోతావ్
ఏం చేస్తున్నానో అడగవా..?
ఆకాశంలో మబ్బుల్ని చూస్తున్నా !
నా హృదయమెలానూ ఘోషించడం ఆపదని
నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయవి..
మరి మధుమాసం కదా..
కోయిలల సంగీతం వినొచ్చుననుకోకు..
కాలాన్ని కల్పించుకు మరీ
ఏకాకి వైరాగ్యాన్ని పాడుతున్నానని
విసుగొచ్చి ఇటు రావడమ్మానేసాయవి..
మగత నిద్రలో నేనున్నప్పుడు
మిరియాల పొడి చల్లి మేల్కొల్పుతున్నావ్..
ప్రహిస్తూ ప్రవహిస్తూ ఘనీభవించినట్లు
నీ అస్తిత్వాన్నిలా ప్రకటించడం నిజమేనా
ముసి ముసి చీకట్లలో
చందమామాలా వెలిగే నువ్వు
నల్లపూసలా మారిపోయావెందుకో నీకైనా తెలుసా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment