ఏమి రోజులివి
భరించలేని విషాదాల్ని చూట్టూ పేర్చేసిఊసులు నెమరేస్తూ ఆశలను పెకిలిస్తున్నవి
ఎవరికి వారు నమ్మకం కోల్పోయి
తమ నీడను చూసి తామే తడబడేలా
కొన్ని ఆర్తనాదాలు గొంతులేస్తున్నవి
కరుగుతున్న తారీకుల్లో
పండగలూ పబ్బాలు మరిచినట్టయి
మృత్యుపొలికేకలు మాత్రమే వినబడుతున్నవి
ప్రకృతి మీద భరోసా
నిశ్శబ్దంలో నిక్షిప్తమైనట్టు
పదాలేవీ ప్రాణం పోసేందుకు రానంటున్నవి
ప్రేమాన్వీ..
భద్రతంటూ ఉన్నదెక్కడ చెప్పూ..
నీ హృదయాన్ని ఆవిరిపడుతూ
ఆ పంజరంలోనే నన్నుండనివ్వి
No comments:
Post a Comment