నిశ్శబ్దంలో మది సంగీతాన్ని ఆపలేకున్నా
నీ హృదయలయను ఇష్టంగా ఆలకించేవిరజాజి మొగ్గలా నవ్వులు దాచలేకున్నా
పూలతోటలో సీతాకోకలా నువ్వు చుట్టుముట్టే
మృదువైన భావనొకటి ముచ్చటగా దాచుకున్నా
అచ్చంగా నీకిమ్మని మనసు చెప్పబట్టే
కన్నులు విప్పారి రెప్పలసలే మూయలేకున్నా
ఆనందపు మధురిమేదో అలలుగా ముంచుకొచ్చే
ప్రేమాన్వీ..
పరవశాల చైత్రమిక పురివిప్పినట్టే
No comments:
Post a Comment