ఎటుచూసినా నీ ప్రతిబింబంముసురేస్తున్న సాయంసంధ్య లేతచీకట్లో
లౌకికానికి నన్ను దూరం చేసి
దిగ్బంధం చేసిన వలయమవుతుంది
నా ఏకాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు
నీలో పల్లవి.. దూరాలు దాటొచ్చి
నాతో చరణాలు కలుపుతుంది
ప్రేమనే మధురాక్షరం చేసి
విరహంతో అల్లుకున్న పదాలనేమో
వసంతమంతా సంచరిద్దాం రమ్మని
ఉల్లాసంలోకి నెడుతుంది
నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ పాట
నా అమూర్తస్థితి మైమరపుగా
దేహానికి తాపిన మకరందమై
తీపి తన్మయత్వాన్ని పొంగిపొర్లుతుంది..
No comments:
Post a Comment