ఆ నవ్వులోనే ఓ పూలతోటుంది
నా పాటనే అది పరిమళిస్తుంది
హృదయంగమ కలకలం నీదైనా
అల్లరిసుళ్ళలో పడిలేవలేనన్నా
పదేపదే సవ్వడిది నీదే
ఈరోజు సుగంధం నాదే
పచ్చని వసంతాన్ని వెదజల్లుతున్న కాలం
నన్ను దొంగిలించిన నువ్వో నక్షత్రం
అనంతమై నన్నల్లుకున్న అంతరంగానికే
అపురూపమైన తపనల తోరణం

No comments:
Post a Comment