కన్నుల కరచాలనం చేసినప్పుడు అనుకోలేదు మనసు రేకులుగా విచ్చి పరిమళిస్తుందని
నాలుగు మాటలకని దోసిళ్ళు పడితే ఏకంగా వెన్నెలపాటలు పంచినట్టు నా తలపులూ తపనలు నీకే రాసిచ్చేసాను
విరహవీణ పలికిన రాగాలు రాలుగాయివని నీ పాలనవ్వుల్లోని గమకాన్ని చూసే గుర్తుపట్టాక
నా హృదయం పులకింతల వశమైంది
నీలో కదలికలు మోహన చంద్రికలై వరుసకట్టాక
మనసంగమం మధుర బృందావనంలోని రాసక్రీడకు గిలిగింతల సరసమద్దింది
పల్లవించు కాలం ముందుండగా నీతోనే శృతి చేసుకుంటా జీవితం..
No comments:
Post a Comment