చాన్నాళ్ళుగా తపిస్తున్న అనురాగం ఆనందపూర్ణ జలపాతంలో ముంచి తేల్చే క్షణం నీ సమక్షానికేమో..
కన్నులు కలిసిన ప్రతిసారీ మెరిసే మిణుగురులైతే నన్నుర్రూతలూపే సుముహూర్తం నీ చూపుల కౌగిలింతకేమో..
విహంగాలై ఎగిరే వినూత్న కోరికల విశేషాలు ఏ సమ్మోహనపు అనుసరణలోని నీ సమీపానికో..
ఎదలయలో కలగలిసిన ప్రియమైన అనంత కలల సుప్తావస్త నీ తలపుల వైపుకో..
ఏమో ఈ తాపమింత..వసంతంలో గ్రీష్మమై నేను జ్వలించేంత..ఇహ నువ్వేగా అందించాలి నులివెచ్చని పులకరింత..
ఎదురుచూస్తున్నానిలా నా సమయం అంతా..నువ్వొస్తే అందిస్తావని మురిపెమంతా
No comments:
Post a Comment