నిలకడలేని వాన పున్నమని మర్చిపోయి
ఆగి సాగే ఆలాపనలా కురుస్తుంది
సమయం గడవని నిర్లిప్త క్షణాలకి
ఒళ్ళు వెచ్చబడి అలసిపోయిన సంగతి
కృత్రిమ నవ్వులో బయటపడిపోతుంది
గుబులుగా మారిన అవ్యక్తపు బెంగ
నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని
ఎక్కడున్నావో నువ్వని తలచినప్పుడు
గొంతుకి గంథం పూసుకున్నట్టు
లోపల్నుంచే నీ పరిమళం గుప్పుమంటుంది
No comments:
Post a Comment