Wednesday, 14 September 2022
//నీ కోసం 491 //
అనుభూతుల ఆకుల సవ్వళ్ళకి
మత్తుగా పరవశిస్తున్న సాయింత్రం
వెన్నులో ప్రవహిస్తున్న ఆనందమిది
కనువిందుగా నీ రూపమున్నందుకే
ఎలా ఉన్నావో కనిపించమంటే
నీలో నువ్వు నవ్వుకుంటూ
మౌనంగా ఎలా ఉన్నావో చూపిస్తున్నావ్
పైగా బెంగని పోగొట్టుకునేలా
ఆత్మాలింగనం చేసుకోమని
ఎంచక్కా కళ్ళతో చెప్పేస్తున్నావ్
అవున్నీకసలు.. భయంతో పాటు
వేళాపాళా ఉండదు..
నీ సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదని
క్షణమన్నా వదలకుండా మనసుపెట్టి నన్ను వింటూ
కనురెప్పల వెనుక దోబూచులాడుతూ
గుండెల్లో ఊయలూగుతూ.. ఇష్టమొచ్చినట్టున్నావ్
ఆకాశంలో పసుపూ ఎరుపురంగుల ప్రదోషం
నేనేమో నిన్నిలా వాక్యంలా రాస్తూ మొదలవడం..
"All that is meant for one is meant to find one..
n that one is u n ur smile.."
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment