Wednesday, 14 September 2022
//నీ కోసం 494 //
అప్పుడప్పుడూ దారితప్పి నా ఊహలప్రపంచంలోకి నువ్వొచ్చేసావేమో అనిపిస్తుంది. మరి ఎప్పటికీ పరిమళం కోల్పోని విరజాజులు, నువ్వు నవ్వితే వెలిగే నా తనువు నూగారూ, విరహమన్నది తెలీనట్టు తీరాన్ని అదేపనిగా ముద్దాడే అలలు.. ఆకాశం మీంచీ రాలిపడి మనపై కురిసే నక్షత్రాలు, ఒకరిలో ఒకరమై మత్తిల్లిన ఉన్మత్తక్షణాలు.. ఏమో తెలీని తమకపు నెమరువేతలే ఇవన్నీ...
కానీ వాస్తవంలో, కాలాలన్నీ కలగాపులగమైపోయి అదో రకంగా మారిన ప్రకృతిలాగే అస్తవ్యస్తమయ్యింది నా మది. ఎప్పుడో అరుదుగా వచ్చే ఎండావానా నిత్యకృత్యమై ఉదయాస్తమానాలను అల్లాడిస్తున్నట్టు అంతర్మధన అపస్వరాలు మనఃస్థితిని కలవరపెడుతున్నాయి. ఏమో.. నాకన్నా నువ్వు చాలా బాగా పాడతావని తెలీకముందు నేను పాడిన పాటే ఆఖరిది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment