నువ్వో సముద్రమైతే..
నేనో పర్వతమై నీలో నిలబడేదాన్ని
నువ్వో పర్వతమైతే..
నేనో చెట్టునై నీలో వేళ్ళూనేదాన్ని
నువ్వో చెట్టువైతే..
నేనంతా కొమ్మలై విస్తరించేదాన్ని
నువ్వో కొమ్మవైతే..
నేనో పక్షినై నీ మీదకొచ్చి వాలేదాన్ని
నువ్వో పక్షివైతే..
నేనో రాగమై నీ గొంతులో పలికేదాన్ని
నువ్వో మనిషివైనందుకు
నీ చూపుల సాయమన్నా లేక
నాకు నేను దూరమై వివశమయ్యి కూడా
పరిమళించడం రాని పువ్వునై మిగిలాను
No comments:
Post a Comment