Wednesday, 14 September 2022
//నీ కోసం 489 //
హేయ్.. చూపులు విడిపోకుండా కలిసుండటం అంటే ఇదేనా..
ఎదురుగా కనిపిస్తున్నందుకు బదులుగా ఆ చిరునవ్వా.. ?!
నాకైతే అలానే ఉంది, నా ముందర పాలపుంతలా నువ్వున్నట్టు
భాద్రపదమైతేనేం.. నువ్వూ చిగురించొచ్చుగా అనడుగుతున్నట్టు..
అలుపెరుగని గుసగుసల పారవశ్యానికి
నిశ్శబ్దం చిన్నబోయేలా మనసు కుదుటపడి
నా ఎర్రని కన్నుల్లో మధురక్షణాల మెరుపు
నీవల్లనేనని తెలిసిపోతుందా ?!
నిండుపున్నమి కెరటాల్లా కవ్వించే
ఆ నవ్వులడ్డుపెట్టి ఎన్ని మాయలు చేస్తావో
పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని చూస్తున్నట్టు
నిముషమైనా రెప్పవేయనివ్వక నిన్నే చూడమంటావు
అందుకే..
మౌనంలో నిమగ్నమైన తదేక ధ్యానంతో
వెచ్చని అలజడికి వివశమయ్యే ప్రాణంతో
పేరు తెలియని భావాల తాపాగ్ని మోహంతో
అణువణువూ ఆర్తినై నిన్నే చూస్తున్నా
Don't smile soo beautiful naa..
else.. will give u my honest expression
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment