Wednesday, 14 September 2022
//నీ కోసం 486 //
ఉదయం నుంచీ తిన్న పరమాన్నం
తేనేసిన పంచామృతాన్ని మించి
ఏంటా పిచ్చి తీపి నీ నవ్వులో
తేరిపార ఎంత చూసినా తపన తీరదే
నువ్వు పుట్టిన్నాడు శరత్కాల చంద్రోదయమయ్యి ఉంటదా
నిన్ను కనే ముందు మీ అమ్మ ద్రాక్షపానకం తాగుంటదా
నా బలహీనక్షణాలను దాటించేందుకు నువ్వొచ్చావా
నీకోసం ఏ జన్మలోనూ తపస్సు చేసిన గుర్తు లేదే ?!
ఈ చిన్మయానంద ప్రేమస్మితం
నా చితికిన హృదయానికి లేపనమో
లోలోపల ఉబుకుతున్న నులివెచ్చని
ఇష్టమైన యాతనా భావసంకల్పమో..
ఏమో.. అలానే నవ్వుతూ ఉండు..
నా కలలూరి
నువ్వు కన్నుల్లోకి చేరినప్పుడు
పసిపాపలా దాచుకునేందుకు మాత్రం అనుమతినివ్వు..
Ur intense smile refilled my soul
n l want to hold it lovingly
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment