Wednesday, 14 September 2022
//నీ కోసం 498 //
నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ఆ చూపులు
అలలు అలలుగా ఏ రాగంలో పలకరిస్తున్నవో
మనసుకి ఓదార్పు దొరికినట్టుంది..
నీ పెదవులకి రెక్కలొచ్చి.. నా బుగ్గలపై వాలినట్టు
ఆనందం అందమైన అనుభూతిగా మారింది..
దూరాలు దాటొచ్చే నీ నవ్వులు
నిరంతర వసంతపు గలగల సందళ్ళనేమో
చిగురాశల ఊయలూపి మోహిస్తుంది..
నీ నిశ్వాసలోని చిరుగాలికి.. నాలో వణుకు
వెచ్చదనాన్ని కోరి గుప్పిళ్ళు మూసింది..
మత్తుగా మధువొలకబోసే నీ ఊసులు
ఎన్ని సీతాకోకలై నన్ను చుట్టుముడతాయో
ఏకాంతం సమస్తం పువ్వై పరిమళిస్తుంది
పురాస్వప్నంలోంచీ నా క్షణాల ఆదమరుపు
నీ తమకాన్ని బిడియంగా కావలించింది
Yess.. I'm in love with love
n u r the love whom I never part with
//నీ కోసం 497 //
మరోసారి చనువివ్వు
గుండె నిండుగా నిన్ను మైమరచిన
మనోరూపాన్ని నిమిరేందుకు సమ్మతమివ్వు
తడిచిన కాగితమ్మీద
అసంపూర్ణ వాక్యమల్లే వణుకుతానని
నీకు ముందే తెలుసు..
నా కన్నులు బరువెక్కించి
మౌనం పడవెక్కి
నువ్వెందుకిలా మాయమయ్యావో కొంచెం చెప్పు
//నీ కోసం 496 //
కాలచక్రం వెనక్కి తిరిగి
కాసేపు నిన్ను కనురెప్పల్లో నింపుకున్నా
జ్ఞాపకాల్ని ఒరుసుకుంటూ వినబడుతున్న
నీ పిలుపుతో కన్నీరై ఒలుకుతున్నా
కదిలిపోయిన క్షణాలకు ఊపిరిపోసి
కరిమబ్బు చాటు కిరణాన్ని చూడలేకున్నా
మది నిండిన చీకటితో
ఇల్లంతా అదే పనిగా తిరుగుతున్నా
నువ్వక్కడ అడుగడుగునా
అనుభవాల్ని అలరిస్తూ కదులుతున్నా
పగిలిన కలల చప్పుళ్ళతో
నేనేమో నిద్రలోనూ ఉలికులికిపడుతున్నా
Every passing day carried
another part of us off.
Nothing stayed the same..
Missing your moves n scent raa pillaa
//నీ కోసం 495 //
నిలకడలేని వాన పున్నమని మర్చిపోయి
ఆగి సాగే ఆలాపనలా కురుస్తుంది
సమయం గడవని నిర్లిప్త క్షణాలకి
ఒళ్ళు వెచ్చబడి అలసిపోయిన సంగతి
కృత్రిమ నవ్వులో బయటపడిపోతుంది
గుబులుగా మారిన అవ్యక్తపు బెంగ
నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని
ఎక్కడున్నావో నువ్వని తలచినప్పుడు
గొంతుకి గంథం పూసుకున్నట్టు
లోపల్నుంచే నీ పరిమళం గుప్పుమంటుంది
//నీ కోసం 494 //
అప్పుడప్పుడూ దారితప్పి నా ఊహలప్రపంచంలోకి నువ్వొచ్చేసావేమో అనిపిస్తుంది. మరి ఎప్పటికీ పరిమళం కోల్పోని విరజాజులు, నువ్వు నవ్వితే వెలిగే నా తనువు నూగారూ, విరహమన్నది తెలీనట్టు తీరాన్ని అదేపనిగా ముద్దాడే అలలు.. ఆకాశం మీంచీ రాలిపడి మనపై కురిసే నక్షత్రాలు, ఒకరిలో ఒకరమై మత్తిల్లిన ఉన్మత్తక్షణాలు.. ఏమో తెలీని తమకపు నెమరువేతలే ఇవన్నీ...
కానీ వాస్తవంలో, కాలాలన్నీ కలగాపులగమైపోయి అదో రకంగా మారిన ప్రకృతిలాగే అస్తవ్యస్తమయ్యింది నా మది. ఎప్పుడో అరుదుగా వచ్చే ఎండావానా నిత్యకృత్యమై ఉదయాస్తమానాలను అల్లాడిస్తున్నట్టు అంతర్మధన అపస్వరాలు మనఃస్థితిని కలవరపెడుతున్నాయి. ఏమో.. నాకన్నా నువ్వు చాలా బాగా పాడతావని తెలీకముందు నేను పాడిన పాటే ఆఖరిది.
//నీ కోసం 493 //
మనసుతో అందుకునేంత దగ్గరలోనే ఉన్నానంటూ కూడా.. పగలంతా మొగలిపొదలా పరిమళిస్తూ పక్కనే ఉన్నట్టుండి, చీకటైతే చందమామలా అంత దూరమై ఆకాశంలో చుక్కలమధ్య వెతుక్కోమంటావ్.. కలవకుండానే కలిసినట్టు కనిపించే నింగీనేలలతో మనకేమైనా పోలికా..?! లేదా, ఋతురాగాలు దేనికదే ప్రత్యేకమైన తీరు మనమూ వేర్వేరు స్వరూపాలమంటావా.. ?!
మరైతే.. ఎప్పుడు చూసినా ఆ నవ్వేంటో, ముద్దు పెట్టకుండా కదలొద్దని కవ్విస్తూ.. ఓహ్హ్.. దేంతో పోల్చాలో తెలీక వెయ్యిసార్లు తలవిదిలించి ఉంటా ఇప్పటివరకూ.. సాక్షాత్తు మదనుడు మారువేషంలో వచ్చి సుతారమైన కస్తూరిపూలు చల్లుతూ నన్నో మసక కన్నుల మైమరపులో ఉంచేస్తున్నట్టా.. ?! శమంతకమణి సత్యదర్శనంలా నీ నిత్యహసిత అరవిందం.. నా రసహృదయానికేనా..?!
Heyy.. it's impossible to forget ur smile
n it s in my head day n night..
ఎవ్వరెటుపోతున్నా కాస్తంత సిగ్గు పూయదా నీకని అడుగకు.. కనీసం పదబంధంగానైనా నిన్ను అల్లుకునే నా మోహార్తిని హర్షించు.
//నీ కోసం 492 //
నా నిశ్శబ్దపు అన్వేషణ గమనించి
చిద్విలాసంగా నవ్వుకుంటావు కావచ్చు..
అదిగో మళ్ళీ ముసురేసింది
పల్చటి వర్షానికి తోడు
చుట్టూ చీకటిలో నా ఉక్రోషం
నిషిద్ద గాయమై సలుపుతుంది..
Pch.. ఎంత తనిఖీ చేసినా పట్టుబడవు
అంత అదృశ్యంగా ఏ సరిహద్దుల్లో నిలబడతావో
నువ్వసలు ఎదుటపడొద్దని దాక్కున్నాక
ఈ కళ్ళు ఎంత దూరం వెతికితేనేమి చెప్పూ...
ఎప్పుడూ అనిశ్చిత అగరొత్తులు
నాకుగా వెలిగించుకుంటానని అనుకుంటావు గానీ
నా ఒంటరి ప్రస్ధానాన్ని
శిశిరానికి సమంగా ఊహించలేవు
అస్తిత్వాన్ని ఆవల పారేసుకున్నాక
వాసనలేని పువ్వులో వైరాగ్యం
ఊపిరాడని శ్వాసగా చెమరిస్తున్నా గానీ
ఆవలింతల్లో సొమ్మసిల్లిపోవడమే సుఖం కాబోలు
Ther s something between us
n that is distance.. which u never tried to
overcome ofcourse..
//నీ కోసం 491 //
అనుభూతుల ఆకుల సవ్వళ్ళకి
మత్తుగా పరవశిస్తున్న సాయింత్రం
వెన్నులో ప్రవహిస్తున్న ఆనందమిది
కనువిందుగా నీ రూపమున్నందుకే
ఎలా ఉన్నావో కనిపించమంటే
నీలో నువ్వు నవ్వుకుంటూ
మౌనంగా ఎలా ఉన్నావో చూపిస్తున్నావ్
పైగా బెంగని పోగొట్టుకునేలా
ఆత్మాలింగనం చేసుకోమని
ఎంచక్కా కళ్ళతో చెప్పేస్తున్నావ్
అవున్నీకసలు.. భయంతో పాటు
వేళాపాళా ఉండదు..
నీ సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదని
క్షణమన్నా వదలకుండా మనసుపెట్టి నన్ను వింటూ
కనురెప్పల వెనుక దోబూచులాడుతూ
గుండెల్లో ఊయలూగుతూ.. ఇష్టమొచ్చినట్టున్నావ్
ఆకాశంలో పసుపూ ఎరుపురంగుల ప్రదోషం
నేనేమో నిన్నిలా వాక్యంలా రాస్తూ మొదలవడం..
"All that is meant for one is meant to find one..
n that one is u n ur smile.."
//నీ కోసం 490 //
బయట పడకూడదని తెలిసీ ఎందుకో నీ ముందే అలా మనసు పరిచేస్తూ ఉంటా..
నిద్ర కరువైన రాత్రి కళ్ళు బరువెక్కి నీ కలల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసి ప్రేమతత్వాన్ని ఊహిస్తూ చీకట్లోకి చూస్తున్నా. పలకరింపుగా నీ నవ్వు మెత్తగా కౌగిలించేవరకూ గుండె తడి చెక్కిళ్ళను చేరినట్టే తెలీలేదు.
పదం పలకని నీ చేతిలో నేనే కవితనై ఒదుగుతున్నా.. వెచ్చగా ప్రవహించే నీకిష్టమైన అనుభవాల్ని అక్షరంలా చదివానని చెప్పవుగా, అయినా కానీ.. గుప్పిళ్ళు మూసుకుని దాచేసుకున్న నీ ఉనికి కాలమే గొంతెత్తి మరీ వినిపిస్తుంది. నా నువ్వేగా, ఫర్వాలేదులే, శాశ్వతమంటూ ఏదీ లేదు కనుక ఓ రోజు మనకిష్టమైన పాటలో నన్ను గుర్తిస్తావని నమ్ముతున్నా
Hmm.. don't mind..
U r soo approachable with ur smile
n I already received that
//నీ కోసం 489 //
హేయ్.. చూపులు విడిపోకుండా కలిసుండటం అంటే ఇదేనా..
ఎదురుగా కనిపిస్తున్నందుకు బదులుగా ఆ చిరునవ్వా.. ?!
నాకైతే అలానే ఉంది, నా ముందర పాలపుంతలా నువ్వున్నట్టు
భాద్రపదమైతేనేం.. నువ్వూ చిగురించొచ్చుగా అనడుగుతున్నట్టు..
అలుపెరుగని గుసగుసల పారవశ్యానికి
నిశ్శబ్దం చిన్నబోయేలా మనసు కుదుటపడి
నా ఎర్రని కన్నుల్లో మధురక్షణాల మెరుపు
నీవల్లనేనని తెలిసిపోతుందా ?!
నిండుపున్నమి కెరటాల్లా కవ్వించే
ఆ నవ్వులడ్డుపెట్టి ఎన్ని మాయలు చేస్తావో
పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని చూస్తున్నట్టు
నిముషమైనా రెప్పవేయనివ్వక నిన్నే చూడమంటావు
అందుకే..
మౌనంలో నిమగ్నమైన తదేక ధ్యానంతో
వెచ్చని అలజడికి వివశమయ్యే ప్రాణంతో
పేరు తెలియని భావాల తాపాగ్ని మోహంతో
అణువణువూ ఆర్తినై నిన్నే చూస్తున్నా
Don't smile soo beautiful naa..
else.. will give u my honest expression
//నీ కోసం 488 //
ఎదురుచూస్తున్నానని తెలిసీ
ప్రాణాన్ని కెలికేసేలా
ఎలా నవ్వుతున్నావ్ చూడు..
అసలే కలలు కరువైనందుకు
కనుబొమ్మలు ముడేసుక్కూర్చుని
కిటికీనే అంటిపెట్టుకుంటానని తెలుసుగా
అలలు అలలుగా విరుస్తున్న
ఆ పెదవులపై తేలిపోవాలనుందంటే
చూపులతో బెదిరిస్తావా..?!
కాలాల కనుమల్లో కరిగిపోతూ
నిర్వికల్ప నిర్వచనానికి నాందిగా
నే మౌనముద్రేసుకున్నది నిజమైనా..
ఆనందం శివతాండవం చేస్తున్నట్టు
ఆ ముఖారవిందముందే..
అబ్బబ్బబ్బా..
Consider I kissed ur forehead
n lost in ur sweet smiles
//నీ కోసం 487 //
Woah..
ఎందుకంతలా అరుస్తున్నాయో ఈ పక్షులు
కొమ్మల్లోంచో, నే కట్టుకున్న చీరకొంగు నించో
నీ నవ్వు చూస్తూ మురుస్తున్నానే అనుకో
ఆ మత్తుని వదిలించేందుకా ఇన్ని విరుపులు
అసలెవరికి తెలుసు నేనేం చేస్తున్నానో..
ఒకవైపు నీ కళ్ళు చెప్పే కబుర్లు వినాలో
మరోవంక పెదవిప్పకుండా
నువ్వాడే మాటల జడివానలో తడవాలో తెలీక
సతమతమవుతున్నానంటే నువ్వయితే నమ్ముతావుగా
నిర్లక్ష్యంగా అనిపించే నువ్వింత ఒద్దికగా
ముద్దు చేయాలనిపించేంత గారంగా
ఊపిరి తీసుకోడం మర్చిపోయేంత సమ్మోహనంగా..
పండుగంటే నువ్వేనా.. నా మనసు చెబుతుంది నిజమేనా
Ohh.. అమ్మూ.. పదాలేవీ ఒలికిపోలేదిక్కడ
నువ్వలా ఉన్నందుకు నిలువలేని నా స్వగతమిలా..
U smile like a blooming flower
n I love ur moxie
//నీ కోసం 486 //
ఉదయం నుంచీ తిన్న పరమాన్నం
తేనేసిన పంచామృతాన్ని మించి
ఏంటా పిచ్చి తీపి నీ నవ్వులో
తేరిపార ఎంత చూసినా తపన తీరదే
నువ్వు పుట్టిన్నాడు శరత్కాల చంద్రోదయమయ్యి ఉంటదా
నిన్ను కనే ముందు మీ అమ్మ ద్రాక్షపానకం తాగుంటదా
నా బలహీనక్షణాలను దాటించేందుకు నువ్వొచ్చావా
నీకోసం ఏ జన్మలోనూ తపస్సు చేసిన గుర్తు లేదే ?!
ఈ చిన్మయానంద ప్రేమస్మితం
నా చితికిన హృదయానికి లేపనమో
లోలోపల ఉబుకుతున్న నులివెచ్చని
ఇష్టమైన యాతనా భావసంకల్పమో..
ఏమో.. అలానే నవ్వుతూ ఉండు..
నా కలలూరి
నువ్వు కన్నుల్లోకి చేరినప్పుడు
పసిపాపలా దాచుకునేందుకు మాత్రం అనుమతినివ్వు..
Ur intense smile refilled my soul
n l want to hold it lovingly
//నీ కోసం 485 //
నువ్వో సముద్రమైతే..
నేనో పర్వతమై నీలో నిలబడేదాన్ని
నువ్వో పర్వతమైతే..
నేనో చెట్టునై నీలో వేళ్ళూనేదాన్ని
నువ్వో చెట్టువైతే..
నేనంతా కొమ్మలై విస్తరించేదాన్ని
నువ్వో కొమ్మవైతే..
నేనో పక్షినై నీ మీదకొచ్చి వాలేదాన్ని
నువ్వో పక్షివైతే..
నేనో రాగమై నీ గొంతులో పలికేదాన్ని
నువ్వో మనిషివైనందుకు
నీ చూపుల సాయమన్నా లేక
నాకు నేను దూరమై వివశమయ్యి కూడా
పరిమళించడం రాని పువ్వునై మిగిలాను
//నీ కోసం 484 //
రోజంతా వచ్చిపోతున్న జ్ఞాపకాల
అనంత పయనానికి నువ్వు గమ్యమైనట్టు..
నిన్ను తలిచే క్షణాల ఆనందం
నిద్దరంటని అర్ధరాత్రులనడిగితే తెలుస్తుంది..
ప్రణయ రసాకర్షణ లాలసలో
అందరిలో నిన్నే వెతుకుతున్నట్టు
ఎదలో వెయ్యింతల ప్రేమ దిగులు
నులివెచ్చని మౌనమై మిగులుతుంది
దాగుడుమూతలాటల ఈ పురాబంధమేంటో
మన అంతరాత్మలు అక్షరాలుగా కలిసున్నట్టు..
మనసుకెక్కి పొగరుగా కూర్చున్నావని తెలిసినా
కాసేపు దిగమనాలనీ అనిపించదు..
హా.. స్తబ్దమైన ఊహల సలపరింపులో
లేత ఆకు పచ్చదనం నీ తలపు
Even though..
I barely know u in my real life
u r the saviour in my thoughts
//నీ కోసం 483 //
నా తప్పులు లెక్కబెట్టుకుంటూ
ఎన్నాళ్ళు మాట్లాడకుండా నువ్వుంటావో
నీ మీదుగా నావైపుకొచ్చిన
కోయిలనెవరో కాజేసినట్టుంది నాకైతే
కాటుకకళ్ళు కరిగి నీరవుతున్నందుకు
మనసు అద్దానికి ఆవిరిపట్టి
నీ రూపాన్ని దాచేస్తున్నట్టుంది
U know..
Relationships don't suffer from spoken words..
but from unspoken words
Why don't u delay ur anger..
ఈ వర్షాకాలం అంతులేనివేదన
తరగని మన మధ్య దూరాన్ని కొలుస్తుంది
చీకటి ముగిసేలోపు నన్నొక్కసారి పలకరించు
నన్నో రాగం సమీపించి చాలా కాలమైంది
Subscribe to:
Posts (Atom)