ఈ మలిసంజె నీలాకాశం మీద
ప్రవహిస్తున్న దేవరాగానికి పూలగాలులు తోడైనప్పుడు
నిన్ను స్వరాక్షరం చేసి పాడుకుంటున్నా..
ఏం వినబడిందనో నిశ్శబ్దాన్ని నిలేసి
అనంతాన్ని ధ్వనించేలా
నువ్వు నవ్వుతూనే ఉండుంటావ్..
కదా..
ప్రేమ పరిమళించే ఏకాంతంలో
మళ్ళీ మళ్ళీ ఎదురు పడుతున్నావంటే..
అదే మరి..
చీకట్లో చుక్కలు ఎంతందంగా మెరుస్తున్నా
కొన్ని రాత్రులు చందమామతోనే చనువుగా వుండాలి..
ఆహా..
ఈ వెన్నెలను ఏమని వర్ణించడం..
ఏకకాలంలో కరుగుతూ సౌందర్యాన్ని స్రవిస్తూ
హృదయాన్ని మంత్రిస్తుందనా..?!
No comments:
Post a Comment