Sunday, 7 July 2024
// నీ కోసం 531 //
చుక్కలు చిగురించే వేళ
నా కురుల్లో చిక్కిన నీ మోహ పారవశ్యం
వసంతపు మనోల్లాసాన్ని ఊయలోపుతుంది..
సముద్రంలోని నురుగంతా ఉబికి
గుండెల్లో పాలపొంగుగా మారి
నీ చేతుల్లో అందమైన ఆకృతి పొందినట్టనిపిస్తుంది
అమృతం తాగి కొండమలుపుల్లో విశ్రాంతి
పొందేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నానికి
ఎదబరువు దించుకునేందుకు మనసూ సాయం చేయమంటోంది..
వెలుతురు పరావర్తనం చెంది
నీ కళ్ళకు ఏం మైకమిచ్చిందో
నా దృష్టికి అదే కలనిచ్చి కలవరపెడుతోంది..
బాగా మాగిన పనసుపండులా దేహం
తేనె వాసనేస్తున్న సమయం
ఈ తీపినంతా నీ పెదవులకే ఇవ్వమంటుంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment