Monday, 8 July 2024
// నీ కోసం 533 //
అతిశయం అనుకుంటావేమో..
ఆకాశం నవ్వుతుంది
ఇప్పటిదాక ఒంటరిగా ఉందేమో
మన మాటలన్నీ వినేసి కిలకిలలాడుతుంది
ఈ కాసేపే హాయి రాగాలు తీసేదని
పక్షులు కూడా గూళ్ళకి పోకుండా
కోకిలతో పోటీ పడి రాగాలు తీస్తున్నాయి
ఒక సుదీర్ఘ సుగంధం
వెన్నంటి నన్ను అనుసరిస్తున్నట్టు
మదిలో అల్లరేం చెప్పనూ..
ఇన్నాళ్ళ మౌనాన్ని మృదువుగా
నువ్వు మేలుకొల్పాక
నేనూ కాగితాన్ని కమ్ముకుంటున్నా..
అయితే..
నీతో అయిదు పది నిముషాలు మాట్లాడితే
తీరిపోయే తనివి కాదని తెలీనట్టు
తడిపొడిగా తడబడతావే..
సంధ్యని ప్రేమించడం ఎంత బాగుంటుందో
నీకూ తెలుసుగా..
"A bit of tenderness can heal any wound"
Am I right to say this..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment