జ్ఞాపకాల జాతర నుంచి తప్పించుకుని
మనోవాల్మీకంలో నిద్రించిన నన్ను
ఏదోకలా తట్టిలేపుతావు
జాలిగా చూస్తున్న నన్ను
వెచ్చగా గుండెల్లో దాచుకుని
మనకిష్టమైన ఆ పాట పాడతావు
ఎక్కడో తప్పిపోయినట్టున్న నేను
కలగంటున్నానో
నిశ్శబ్దపు సుషుప్తిని పీలుస్తూ
నీ దేహపరిమళపు మత్తుని ఊహిస్తున్నానో
నా శ్వాసలో అరవిరిసిన పువ్వుల పులకింతలు మొదలవుతుంటే..
No comments:
Post a Comment