నీ కోసం
Monday, 8 July 2024
// నీ కోసం 537 //
నిన్ను చూడాలనే నా బెంగంతా
ఎందుకనంటే ఏమ్ చెప్పనూ
అదో మనశ్శాంతి కావొచ్చు..
నువ్వు కనిపించే ఆ కొన్ని క్షణాల కోసం
ఎంత నిరీక్షణో ఎలా తెలుపనూ
నీకదో తడబాటుగా అనిపించవచ్చు..
ఆగి ఆగి రువ్వే నీ నవ్వులున్నాయే
పసి పాప కళ్ళల్లోని మెరుపుల్లా
నా చుట్టూ వెలిగే దీపాలవుతాయి..
నీ మౌన స్వరమనే అలల హోరుందే..
నన్ను సముద్రపు ఒడ్డున నిలబెట్టి
చిగురేయమనే చినుకులై తడిపేస్తాయి..
హా.. నా శీతాకాలపు జ్ఞాపకాలు
నీ పారవస్యపు చప్పుళ్ళుగా మారి
చలి కాసుకునేందుకు పిలుస్తున్నాయి..
ఇది చెప్పాలనే ఎదురుచూస్తున్నా..
Hmm.. ఏమని స్పందించాలో తెలీకనే
బహుశా ఏ కలవరంలోనో బందీవై నువ్వుండవచ్చు
అని కూడా అనుకుంటున్నా..
Subscribe to:
Posts (Atom)