Wednesday, 21 July 2021

// నీ కోసం 381 //

బాగా పరిచయమైన సువాసనలా నీ నవ్వులకో మత్తుంటుంది. మనసంతా పూలు పూసి తేనెలొలికి నరనరాల్లో అమృతమేదో ప్రవహిస్తున్న వింత.. కలకాలం తపించిన స్పర్శేదో అనుభవానికొస్తుంది. అప్పటికప్పుడు పరిమళాల్లో పునీతమైనట్టు దేహం, నీ ఉనికినో చిలిపి కవితగా చుట్టుకుంటుంది. గుండె ఊయల మీద పసిపాప కేరింతల రాగంలా నీ గుసగుస నిద్దురనేమార్చుతుంది. అవ్యక్త భావగీతికల్లా నీ నవ్వులు కెరటాలై రంగురంగుల నా హృదయకాగితాన్ని తీరపు పడవలుగా తేల్చుతాయి. మౌనంగా నువ్వు పాడే పాటలన్నీ అంతర్వాహినిగా నా పెదవిని తాకే పల్లవులవుతాయి. మరో లోకానికి పోదాం రమ్మనే మోహంలా తాజాగా తాకుతుంటాయి. అది మొదలు అంతులేని స్వాతిశయాలు అక్షరాలను అదుముకొనేలా ఆనందాలు చిమ్ముతాయి. కళ్ళు మూసుకుని సోలిపోయే సుషుప్తిలో ఆహ్వానించకనే దిగివచ్చే ఆకాశమేమో నువ్వనిపిస్తాయి. మధురస్మృతిలోని మైమరపు క్షణాల్లా నీ నవ్వులు పులకింతల చెక్కిలిగింతలవుతాయి. ఊహలకు ప్రాణం పోసేలా కొన్ని బంగారు కాంతులు కన్నుల్లో కొలువుకొస్తాయి. చీకటివెలుగుల కలనేతలో చల్లగాలి చేర్చే ఊసులన్నీ నీవేననిపిస్తాయి. సర్వేంద్రియాల మైకం నీ బుగ్గలు చుంబించమని ప్రేరేపిస్తాయి. ఆవిరి పట్టిన అద్దంలోంచీ చూసినట్టనిపిస్తూ.. నిముషానికోసారి మూగబోయేలా నన్నెందుకిలా శిక్షిస్తావో తెలీదు.. అయినా సరే, నీ నవ్వులంటే నాకిష్టం. Becoz.. ur smile is intrinsic n u r a garden, that I can visit anytime

No comments:

Post a Comment