అడ్డుకోలేని ఆలోచనల అరల్లో
అద్భుతమైన జ్ఞాపకాల మరకలు
వర్తమానాన్ని అతీతంగా ఉసిగొల్పి
నా చీకటి గుండెల్లో మౌనాన్ని నిట్టూర్చేసి
వసంతవర్ణం పాడదాం రమ్మంటున్నట్టు
ఆనందానికో అస్తిత్వముందంటే
అది నీ ధ్యాసలోనేనని
నే మనసుపడ్డ నీ కన్నుల్లో
అరమోడ్పుల నెలవంకలు
సుప్రభాత సున్నితత్వాన్ని ఆస్వాదిస్తున్నట్టు
నువ్వు నమ్మకున్నా రోజూ ఇంతే..
️
చెప్పు..ఎప్పుడొస్తావ్..
నీ కనుకొలుకుల సంగీతం వినాలి
నన్ను నేను విస్మరించేలా గుసగుసలు కావాలి
యుగళగీతమంటి పదాల గోదారిలో ఈదులాడాలి
అలవోకగా అనంతానంత లోకాలు చుట్టిరావాలి..

No comments:
Post a Comment